యువకుడి ఇంట్లో వివాహిత ఆత్మహత్య - బాత్రూమ్‌లో చీరతో ఉరి

ఠాగూర్
మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (12:29 IST)
పాలమూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. ఓ యువకుడి ఇంటిలో వివాహిత ఒకరు బలన్మర
ణానికి పాల్పడ్డారు. బాత్రూమ్‌లో చీరతో ఉరి వేసుకుది. ఆ మహిళ తన గదిలోనే ఉందని బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆ యువకుడు.. ఆమెను కాపాడే ప్రయత్నం చేసాడు. అది కాస్త ఆలస్యం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన నాగోలు ఠాణా పరిధిలో జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా రెడ్యాలకు చెందిన మహిళ (38), భర్త, కుమార్తె, కుమారుడున్నారు. వీరి ఇంటికి సమీపంలోనే నివసించే బానోత్ అనిల్ నాయక్(24)తో ఆమెకు పరిచయం ఉంది. అనిల్ నాగోలులోని అంధుల కాలనీలో ఉంటున్నాడు. 
 
ఈ నెల 20న తన మూడేళ్ల కుమారుడికి నగరంలోని ఆస్పత్రిలో చికిత్స చేయిస్తానని ఇంట్లో చెప్పి ఆమె అనిల్ వద్దకు వచ్చింది. 21న రాత్రి వరకు ఇద్దరూ కలిసే ఉన్నారు. కూరగాయలకు బజారుకు వెళ్లి వచ్చేసరికి ఆమె బాత్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తలుపు తీయమని బతిమాలినా స్పందన లేకపోయేసరికి.. బాత్రూం వెంటిలేటర్ నుంచి చూడగా ఆమె ఉరివేసుకోవడం కనిపించింది. 
 
అతను తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్లేలోపు హ్యాంగర్‌కు చీరతో ఉరేసుకుని తుదిశ్వాస విడిచింది. ఆమె మరణించడంతో తానూ ఆత్మహత్య చేసుకోవాలని చేయి కోసుకున్నాడు. ఎదురుగా మృతురాలి మూడేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించడంతో రక్తమోడుతున్న చేతికి దస్తీ కట్టుకుని నేరుగా ఠాణాకు వెళ్లి విషయం తెలిపాడు. సోమవారం నాగోలు చేరుకున్న మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు అనిల్‌ను కఠినంగా శిక్షించాలని ఠాణా ముందు బైఠాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments