శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఠాగూర్
మంగళవారం, 18 నవంబరు 2025 (11:03 IST)
తన భార్య ఎడబాటును ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. శ్రావ్య.. నీవు లేని జీవితం నాకొద్దు అంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు నగరానికి చెందిన ముత్యాల విజయ్ (40) యేడాదిన్నర క్రితం తన భార్య శ్రావ్య (35)ను తీసుకుని హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అతను స్థానిక విమానాశ్రయంలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎఫ్ ద్వారా శ్రావ్య గర్భందాల్చింది. ఆమె గర్భంలో కవలలు పెరుగుతున్నారని తెలుసుకుని ఆ దంపతులు ఎంతో సంతోషించారు. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భవతి కూడా.
 
ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన రాత్రి సమయంలో ఆమెకు కడుపునొప్పి రావడంతో అత్తాపూర్‌లని మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్య కోసం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన విజయ్... శంషాబాద్ నివాసంలో ఉరేసుకున్నాడు. దంపతులు, కవలల మృతదేహాలను ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం