Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి... ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (14:35 IST)
ఇటీవలి కాలంలో వావివరసలు మంటకలిసిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే పశువుగా మారిపోయి కన్నబిడ్డల శీలాన్ని కాటేస్తున్నాడు. తాజాగా ఓ కన్నతండ్రి కామంతో కళ్ళుమూసుకుని కుమార్తెను గర్భవతిని చేశాడు. ఈ విషయం బయటకు చెప్తే అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. ఈ దారుణం మోమిన్ పేటలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని మోమిన్ పేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు పిల్లలు. వీరిని మోమిన్ పేటలో చదివిస్తూ భార్యత కలిసి పటాన్ చెరువులోని ఆ ఫాంహౌజ్‌లో పని చేస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ అమలు చేయడంతో స్కూల్స్ మూసివేశారు. దీంతో ముగ్గురు పిల్లలను తమ వద్దకు తీసుకెళ్లారు. 
 
ఈ క్రమంలో 8వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెపై కామాంధ తండ్రికి కన్నుపడింది. అంతే ఇంట్లో భార్య లేని సమయంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత పలు మార్లు అదేవిధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ యువతి అనారోగ్యానికి గురైంది. దీంతో ఆస్పత్రి తీసుకెళ్లిన తల్లికి వైద్యులు చెప్పిన మాట విని గుండె ఆగిపోయినంత పని అయింది. 
 
ఇంటికి వెళ్ళి కుమార్తెను నిలదీయగా అసలు విషయం చెప్పింది. ఇదే విషయంపై భర్తను నిలదీయగా ఈ విషయం బయటకు చెబితే అందర్నీ చంపేస్తానని హెచ్చరించాడు. పైగా, గర్భస్రావం చేయించాలని రూ.20 వేల నగదు ఇచ్చాడు. దీంతో దిక్కుతోచని ఆ తల్లి.. కుమార్తెను వెంటబెట్టుకుని పటాన్‌చెరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికెళ్లి అబార్షన్ చేయాలని వైద్యులను ప్రాధేయపడింది. 
 
కానీ, వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి బాధితురాలి వద్ద విచారణ జరపి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments