హైదరాబాద్‌లో కరుడుగట్టిన సర్వర్ల హ్యాకర్ అరెస్టు

Webdunia
బుధవారం, 11 మే 2022 (15:11 IST)
హైదరాబాద్ నగరంలో కరడుగట్టిన సర్వర్ హ్యాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పలు బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల సర్వర్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొడుతున్న కేటుగాడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేటుగాడి నుంచి రూ.53 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
అరెస్టు చేసిన హ్యాకర్ పేరు శ్రీరామ్ దినేష్. ఇంజనీరింగ్ డ్రాపౌట్ విద్యార్థి. దినేష్‌కు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్ అంటే మోజు. కంప్యూటర్ బగ్స్ కనిపెట్టడంలో దిట్ట. విజయవాడలో మూడు కంపెనీలు స్టార్ట్ చేశాడు. 2021లో గుర్గావ్ కేంద్రంగా పని చేస్తున్న బెస్ట్ పే అనే యాప్‌ ద్వారా రూ.25 లక్షలు కొల్లగొట్టాడు. దినేష్‌పై ఢిల్లీ, గుర్గావ్‌లలో పలు కేసులు ఉన్నాయి. ఇలాంటి కేసును దేశంలో ఇప్పటివరకు ఎక్కడా పట్టుకోలేదు. 
 
హైదరాబాద్ నగరంలోనే తొలిసారి సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేవాడు. ఇలా మొత్తం రూ.53 లక్షలు బదిలీ చేశాడు. ఇందులో ఇప్పటికే రూ.18 లక్షలు రికవరీ చేశాం. గడిచిన మూడు లేదా నాలుగేళ్ళలో కనీసం రూ.5 కోట్ల మేరకు బదిలీ చేసినట్టు దినేష్ అంగీకరంచాడని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments