Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడపై కత్తి పెట్టి వివాహితపై అత్యాచారం చేసిన భర్త క్లోజ్ ఫ్రెండ్

Webdunia
గురువారం, 13 జనవరి 2022 (21:28 IST)
బాలానగర్‌కు చెందిన ఓ మహిళను ఎస్‌ఆర్ నగర్‌లో ఆటో రిక్షా డ్రైవర్ కత్తిని మెడపై పెట్టి బెదిరించి అత్యాచారం చేశాడు. ఇటీవల అరెస్టయిన తన భర్తకు బెయిల్ లభించేలా సహాయం చేస్తానని నమ్మబలికి ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
 
నిందితుడు మొహమ్మద్ జహంగీర్ అదే ప్రాంతానికి చెందినవాడు. బాధితురాలి భర్తకు స్నేహితుడు కూడా. భర్తను కలిసేందుకు తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. గతేడాది ఆగస్టులో ఆమె భర్త డ్రగ్స్‌ కేసులో అరెస్టయి జైలు పాలయ్యాడు.

 
ఒక లాయర్‌ని ఏర్పాటు చేసి తన భర్తకు బెయిల్ తెచ్చిపెట్టడం ద్వారా ఆమెకు సహాయం చేస్తానని జహంగీర్ ఆమెను నమ్మించాడు. ఆమె అతడి మాటలు నమ్మింది. అదే నెలలో జహంగీర్ ఆమెను అమీర్‌పేటలోని ఒక లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెను గదిలో బంధించి మెడపై కత్తి పెట్టి బెదిరిస్తూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె కుమారుడిని కూడా బెదిరించాడు.
 
 
అప్పట్నుంచి అదే అదనుగా తీసుకున్న జహంగీర్ ఆమెపై వేధింపులు కొనసాగిస్తూ వచ్చాడు. అతడి వేధింపులు భరించలేని బాధితురాలు బాలానగర్ పోలీసులను ఆశ్రయించింది. బాలానగర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, కేసును బుధవారం అధికార పరిధిలోని ఎస్‌ఆర్ నగర్‌కు బదిలీ చేశారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రశ్మిక మందన్న

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments