రూ.1.2 కోట్లతో పారిపోయిన డ్రైవర్.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 29 మే 2023 (09:41 IST)
హైదరాబాద్ నగరంలో ఓ నిర్మాణ సంస్థ డ్రైవర్ రూ.1.2 కోట్ల నగదుతో పారిపోయాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని ఆదిత్రి హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరు వాసి బానోతు సాయికుమార్‌ మాదాపూర్‌లో ఉంటూ మూడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
 
సంస్థ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు ఈనెల 24వ తేదీన ఉదయం 8.30 గంటలకు రూ.1.2 కోట్లను జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఇవ్వాల్సిందిగా సూచించారు. సాయికుమార్‌ కార్యాలయ వాహనం ఇన్నోవా (టీఎస్‌08హెచ్‌పీ9788)లో డబ్బుతో బయలుదేరాడు. 
 
కొంతదూరం వెళ్లిన తర్వాత అక్కడ కారు వదిలేసి నగదుతో పరారయ్యాడు. డబ్బు ఇంట్లో ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్‌ రావు..  డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా కలవలేదు. దీంతో ఏజీఎం షేక్‌ జిలానీ అదేరోజు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని ఆదివారం రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments