Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు మైనర్లు

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (15:40 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, సైదాబాద్‌లో ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్ కుర్రోళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురి వయసు 16, 11, 9 యేళ్లుగా ఉన్నాయి. వీరంతా కలిసి ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణం వివరాలను పరిశీలిస్తే, సైదాబాద్‌లో ఉంటున్న ఓ దంపతులకు ఆరు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రోజూ ఉపాధి కోసం కూలీ పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి వస్తుంటారు. 
 
అలాగే, ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉదయం అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నానికి ఇంటికి వస్తుంటారు. ఈ క్రమంలో గత మూడు రోజులుగా పెద్దమ్మాయి జ్వరంతో బాధపడుతూ ఇంటిపట్టునే ఉంటుంది. చిన్నపాప ఒక్కతే అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి వచ్చేది. అయితే, ఆ పాప టీవీ చూసేందుకు పొరిగింటికి వెళ్లింది. ఆ సమయంలో ముగ్గురు మైనర్లు ఆ బాలికను భవనంమీదకు పిలిచి లైంగికదాడికి తెగబడ్డారు. 
 
ఆ తర్వాత ఆ బాలిక రోదిస్తూ ఇంటికి రాగా, తల్లి నిలదీయడంతో అసలు విషయం వెల్లడించింది. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ముగ్గురు పోలీసులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోంకు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments