Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయానక ఘటన: వామ్మో... బాలుడి తలను నోట కరుచుకుని వెళుతున్న కుక్క

Webdunia
సోమవారం, 14 మార్చి 2022 (10:21 IST)
భయానక ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ కుక్క బాలుడి తలను నోట కరుచుకుని వీధిలో వెళుతుండగా దానిని గమనించిన స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 
పూర్తి వివరాలను చూస్తే... హైదరాబాద్ నగరంలోని శివారు ప్రాంతంలోని మన్సూరాబాద్ సహారా రోడ్డులో ఓ పాల షాప్ దగ్గర కార్తీక్ అనే యువకుడు కూర్చుని వున్నాడు. ఇంతలో ఓ కుక్క బాలుడి తలను నోట కరచుకుని పరుగుపెడుతూ అటుగా వచ్చింది. దాన్ని చూసిన కార్తీక్, ఇతరులు షాక్ తిన్నారు. ఆ కుక్కను వెంబడించగా బాలుడి తలను పొదల్లో వదిలేసి వెళ్లిపోయింది.

 
ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి తలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టంకి తరలించారు. ఐతే ఈ బాలుడి తలను కుక్క ఎక్కడి నుంచి తీసుకుని వచ్చిందన్న దానిపై పోలీసులు కనుగొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

 
ఆ ఘటన చూసి కొయ్యబారిపోయిన జనం
అంతా చూస్తూనే వున్నారు. రైలు వేగంగా వస్తుండగా ఓ యువకుడు ఫ్లాట్ఫాం పైనుంచి రైలు పట్టాలపైకి దూకి ఎదురుగా వస్తున్న రైలువైపు దూసుకెళ్లాడు. అంతే స్పాట్ డెడ్. ఆ హఠత్ సంఘటన చూసిన వారు కొయ్యబారిపోయారు.

 
వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వే స్టేషనులో ఒకటవ నెంబరుపైన ఓ యువకుడు అటూఇటూ చలాకీగా తిరుగుతూ కన్పించాడు. ఇంతలో రెండవ ఫ్లాట్‌ఫాం పైకి వేగంగా విశాఖ ఎక్స్‌ప్రెస్ వస్తోంది. ఐతే చటుక్కున ఆ యువకుడు ఒకటవ ఫ్లాట్ ఫామ్ పైనుంచి రైలు పట్టాలపైకి దూకి వేగంగా వస్తున్న విశాఖ ఎక్స్ ప్రెస్ రైలుకి ఎదురుగా దూసుకెళ్లాడు. 

 
అంతా కేకలు వేస్తుండగానే అతడి శరీరం నలిగిపోయింది. ఆ దృశ్యాలు చూసిన వారు కొద్దిసేపు మొద్దుబారిపోయారు. ఈ యువకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియరాలేదు. పైగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని శవంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన శనివారం జరిగింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments