నిన్న తనపైన తన కొడుకు శ్రీనివాస్‌పై చీటింగ్ కేసు పెట్టిన శరణ్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడనీ, ఆయన వెనుక ఓ పొలిటీషన్ వున్నాడనీ, త్వరలో ఆ వివరాలు బయట పెడతానని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. శుక్రవారంనాడు శరణ్‌కుమార్ నాంపల్లి కోర్టులో కేసు పెట్టాడు. దీనిపై పోలీసులు పరిశోధన చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారంనాడు బెల్లంకొండ సురేష్ మీడియా ముందు వచ్చి వివరాలు తెలియజేశారు.
- శరణ్ కుమార్ మా ఊరువాడే. సినిమా టిక్కట్లు ఇవ్వమని గొడవచేసేవాడు. పెద్ద హీరోల సినిమా టైంలో వచ్చేవాడు. అలా గతంలో శరణ్ కుమార్ వచ్చి మమ్మల్ని కలిశాడు. ఓ సినిమా చేద్దాం. నా దగ్గర ఒక డైరెక్టర్ ఉన్నాడని అన్నాడు. అతనికి అడ్వాస్ ఇచ్చానని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చానని మాపై తప్పుడు కేసు పెట్టి అటు పోలీసులను ఇటు కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడు. కేసును పోలీసులు పరిశోధిస్తున్నారు. నాకు గానీ, హీరోకి గానీ అడ్వాన్స్ ఇవ్వలేదు.అతను అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయం మావైపే ఉంది. పోలీస్, కోర్టు తీసుకోబోయే న్యాయమైన తీర్పుకు నేను కట్టుబడి ఉంటానని బెల్లంకొండ సురేష్ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ, నన్ను నా ఫ్యామిలీ ని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది పన్నిన కుట్రలో భాగమే నా ఫై నమోదు అయిన కేసు . నాకు శరన్ ఎలాంటి డబ్బు ఇవ్వలేదు. నా కొడుకు సినిమాలు డబ్బింగ్ అయి బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయి. నా ఫై నా కొడుకు ఫై కావాలనే కుట్ర చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. శరన్ ఒక్క పైసా మాకు ఇవ్వలేదు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి. శరన్ తో కలిసి కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు
నేను డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే పరువునష్ట దావా వేస్తా. బెల్లంకొండ ఫ్యామిలీ ఎదుగుదల చూడలేకనే కేసులు పెడ్తున్నారు. పోలీసుల విచారణకు సహరిస్తా. 85 లక్షల రూపాయలు ఇచ్చాను అంటూ నాపై ఆరోపణ వచ్చింది. నన్ను బ్యాడ్ చేయడానికి శరణ్ ఆరోపణలు చేశారు.
కోర్టులో ప్రైవేటు పిటీషన్ వేశాడు.. అతని దగ్గర ఆధారాలు తీసుకురావాలంటూ శరణ్‌కు నోటీసులు ఇచ్చారు. నా పిల్లలు జోలికి వచ్చాడు..నా పిల్లలు నా పంచ ప్రాణాలు. శరణ్‌ను లీగల్‌గా ఎదుర్కొంటా. అతనిపై పరువు నష్టం దావా వేస్తా. ఏదన్నా ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి..నాకు కోర్టు నుండి కాని సీసీఎస్ నుండి ఎలాంటి నోటీసులు రాలేదు. నా పై ఆరోపణలు చేసిన వ్యక్తికే నోటీసులు ఇచ్చారు.. నా పై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఉంటే ఇవ్వాలని శరణ్‌కు నోటీసులు ఇచ్చారు.