Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్నాడు రొంపిచర్లలో వృద్ధురాలిపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2022 (09:45 IST)
ఉమ్మడు గుంటూరు జిల్లాలోని పల్నాడు సమీపంలోని రొంపిచర్ల మండలంలో ఓ వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాధితురాలిని హత్య చేశాడు. విప్పర్లలో ఆరు బయట నిద్రిస్తుండగా ఈ దారుణం జరిగింది. అయితే, ఈ దారుణానికి పాల్పడిన కామాంధుడుని పోలీసు జాగిలాలు గుర్తించాయి.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రొంపిచర్ల మండలంలోని విప్పర్లకు చెందిన 65 యేళ్ల వృద్ధురాలు రోజులానే శుక్రవారం రాత్రి ఇంటిముందు ఆరుబయట నిద్రించింది. శనివారం ఉదయం పొద్దెక్కినా లేవకపోవడంతో వెళ్లి లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె శరీరంపై గాయాలు ఉండడంతోపాటు దుస్తులు తొలగించి ఉండడంతో అత్యాచారం చేసి హత్య జరిగినట్టు అనుమానించారు. దీంతో పోలీస్ జాగిలాలతో తనిఖీ చేయించారు. 
 
శునకాలు అక్కడికి సమీపంలోనే ఉన్న పెరవలి మణికంఠ (27) ఇంట్లోకి వెళ్లడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తానే ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments