చెల్లిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడనీ యువకుడిని హత్య చేసిన అన్న

ఠాగూర్
మంగళవారం, 7 అక్టోబరు 2025 (16:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దారుణం జరిగింది. తన చెల్లిని ఓ యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని అన్న.. ఆ యువకుడుని హత్య చేశాడు. గుంటూరులోని ఏటుకూరు రోడ్డులో ఈ దారుణం చోటుచేసుకుంది. యువతి సోదరుడితోపాటు మరో ఇద్దరు యువకులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
కొలకలూరుకు చెందిన యువతిని.. విద్యుత్‌ శాఖలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తోన్న గణేశ్‌‌ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం రక్షణ కోరుతూ గతంలో గుంటూరులోని నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. అప్పట్లో పోలీసులు ఇరుకుటుంబాలను పిలిచి మాట్లాడారు. అంత సద్దుమణిగిందని భావించిన తరుణంలో తమ కుమారుడిని దారుణంగా కత్తులతో పొడిచి చంపారని గణేశ్‌ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
టిక్కెట్ లేకుండా రైలెక్కి ... టీసీపైనే ఎదురుదాడి చేసిన మహిళ 
 
టిక్కెట్ లేకుండా రైలు ఎక్కిన ఓ మహిళ టీసీతోనే వాగ్వాదానికి దిగింది. టీసీపై ఎదురు దాడి చేయడంతో పాటు తనను వేధిస్తున్నాడంటూ ఆరోపించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఓ మహిళ టిక్కెట్ లేకుండా రైలులో ఏసీబోగీలో కూర్చొంది. ఇంతలో అక్కడకు వచ్చిన టీసీ... టిక్కెట్ చూపించాలని కోరగా, తాను టిక్కెట్ తీసుకోలేదని ఆ మహిళ చెప్పింది. దీంతో ఏసీ నుంచి జనరల్ క్లాస్‌కు వెళ్లాలని ఆ మహిళకు టీసీ సూచించారు. 
 
అయినా సరే ఆ మహిళ ఏమాత్రం వినిపించుకోకుండా నన్ను వేధిస్తున్నారు అంటూ టీసీపైకి ఎదురుదాడికి దిగింది. ఆయనను అసభ్య పదజాలంతో దుర్భాషలాడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర లో ఆర్‌పిఎఫ్ పాత్ర గురించి రవితేజ ఏమన్నాడో తెలుసా!

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు కోసం సర్ ప్రైజ్ ఇవ్వనున్న అనిల్ రావిపూడి

Priyadarshi: యువత అల్లరి, రహస్యాన్ని సమాన స్థాయిలో మిళితం చేసే మిత్ర మండలి ట్రైలర్

Yash: కేజీఎఫ్ చాప్టర్-2తో టాక్సిక్ పోటీపడలేదు.. యష్ వల్లే అంతా జరిగింది: కేఆర్కే

మా కుమార్తె ముఖాన్ని అందుకే చూపించడం లేదు : ఉపాసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments