Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యేడాది వయసున్న గేదెపై యువకుడి అత్యాచారం.. ఎక్కడ? (వీడియో)

Advertiesment
buffalo

ఠాగూర్

, మంగళవారం, 23 సెప్టెంబరు 2025 (10:08 IST)
కామాంధుల వికృత చేష్టలకు అభం శుభం తెలియని చిన్నారులే కాదు.. నోరులేని జీవాలు కూడా బలవుతున్నాయి. ఇటీవల వనపర్తి జిల్లాలో ఓ వ్యక్తి గేదెలపై అత్యాచారం చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మరువక ముందే మెదక్ జిల్లాలో అలాంటిదే మరో అమానవీయ ఘటన జరిగింది. పశువుల పాకలో కట్టేసివున్న యేడాది వయసున్న లేగ దూడపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణమంతా అక్కడ అమర్చివున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో నిందితుడి బండారం బయటపడింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం, మీర్జాపల్లి గ్రామానికి చెందిన సిద్ధిరాములు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని షెడ్డులో పశువులను పెంచుకుంటున్నారు. రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం కూడా తన పశువులను షెడ్డులో కట్టేసి ఇంటికి వెళ్లాడు. అదే ప్రాంతంలో పని చేస్తున్న బీహార్‌కు చెందిన రోహిత్ అనే యువకుడు ఆదివారం రాత్రి, ఎవరూ లేని సమయంలో పశువుల షెడ్డులోకి వెళ్లి అక్కడ కట్టేసివున్న గేదె దూడపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే, పశువుల పాకలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ వికృత చేష్టను యజమాని సిద్ధిరాములు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకుని నిందితుడు రోహిత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆగ్రహంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో కలకలం రేపుతున్న కలరా : నాలుగు కేసుల గుర్తింపు