Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూడూరులో దారుణం: కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 18 జులై 2024 (22:20 IST)
నెల్లూరు జిల్లా గూడురులో దారుణం జరిగింది. కాలేజీకి వెళ్తున్న యువతిని వినయ్ అనే రౌడీషీటర్ బెదిరించి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని తీసుకుని వెళ్లాడు. ఊరి బయట నిర్మాణంలో వున్న ఇళ్ల వద్దకు తీసుకుని వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు.
 
నిందితుడు గత రెండేళ్లుగా తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తూ వస్తున్నాడు. అతడిని హెచ్చరించడంతో ఆమెను పట్టించుకోనట్లే వున్నాడు కానీ ఈరోజు ఆమె కాలేజీకి వెళ్తుండగా అడ్డగించాడు. బలవంతంగా ఆమెను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి, తనను పెళ్లాడాలంటూ ఒత్తిడి చేసాడు. ఎంత బ్రతిమాలినా యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై అత్యాచారం చేసాడు.
 
అవమానభారాన్ని తట్టుకోలేని బాధితురాలు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రపరిచే లైజాల్ లిక్విడ్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడికి కఠిన శిక్ష విధిస్తామని చెప్పారు. యువతలో కొందరు మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారనీ, ఆడపిల్లల జోలికెళ్తే తీవ్రచర్యలు వుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments