కామవాంఛ తీర్చని బాలిక.. కాళ్లు విరగ్గొట్టిన ఆటో డ్రైవర్... ఎక్కడ?

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:42 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. 14 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పిన నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన కామాంధుడైన ఆటో డ్రైవర్.. ఆ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. అందుకు ఆ బాలిక సహకరించలేదు. దీంతో ఆగ్రహంతో ఆ బాలిక రెండు కాళ్లు విరగ్గొట్టాడు. ఆ తర్వాత తన కామవాంఛ తీర్చుకుని బాలికను అక్కడే వదిలివేసి వెళ్లిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌లో నివాసముండే ఓ బాలిక తన మేనమామ ఇంటికి వెళ్లేందుకు స్థానికంగా ఉండే బసుకినాథ్ బస్టాండుకు చేరుకుని బస్సుకోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలో ఓ ఆటో డ్రైవర్ అక్కడకు వచ్చి.. ఎక్కడకు వెళ్లాలని ఆ బాలికను అడిగాడు. పైగా, వెళ్లాల్సిన ప్రాంతానికి తాను తీసుకెళ్లానని నమ్మించాడు. అతని మాటలు నమ్మి బాలిక ఆటోలో ఎక్కింది. 
 
ఆ సమయంలో ఆ ఆటోలో మరో మహిళ కూడా ఉండటంతో బాలికకు అనుమానం లేదా భయం వేయలేదు. అలా అరగంట ప్రయాణం చేసిన తర్వాత ఆ ఇద్దరిని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. వారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆటో డ్రైవర్ దారుణాన్ని ముందుగానే పసిగట్టిన మహిళ అక్కడ నుంచి పారిపోయింది. కానీ బాధిత బాలిక మాత్రం ఆటో డ్రైవర్ చెర నుంచి తప్పించుకోలేక పోయింది. 
 
దీంతో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడమే కాకుండా తనను ఏమీ చేయొద్దని ప్రాధేయపడినప్పటికీ అతను వినిపించుకోలేదు. అలాగే, ఆ బాలిక కూడా అతనికి లొంగలేదు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆటో డ్రైవర్ ఆ బాలిక కాళ్లు విరగ్గొట్టడంతో దిక్కులేని పరిస్థితుల్లో బాలిక బిక్కుబిక్కుమంటూ అక్కడే కుప్పకూలిపోయింది. 
 
రాత్రంతా అక్కడే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం అక్కడ నుంచి కాళ్లు ఈడ్చుకుంటూ రోడ్డుకు చేరుకుని సాయం కోసం అర్థించింది. ఆ బాలికను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం