భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

ఐవీఆర్
గురువారం, 17 ఏప్రియల్ 2025 (19:53 IST)
తమిళనాడులోని తెన్‌కాశిలో ఒళ్లు గగుర్పొడిచే హత్య జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ ఓ షాపుకి వెళ్లి నడిచి వస్తుండగా వారిని అడ్డగించారు నలుగురు వ్యక్తుల గ్యాంగ్. అనంతరం నలుగురూ కలిసి భార్యాభర్తల్లో భార్యను పక్కకు నెట్టి ఆమె భర్త తల నరికేసారు. ఈ హఠత్పరిణామానికి అతడి భార్య భీతిల్లిపోయింది.
 
ఆమె కేకలు వేసి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసే లోపుగానే దుండగులు నరికిన తలను తీసుకుని వెళ్లిపోయారు. సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ గుడి ద్వారం ముందు విసిరేసి వెళ్లిపోయారు. ఈ దారుణానికి పాల్పడిందెవరన్నది తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల కోసం గాలించగా కాశిమజోర్పురం లోని దేవాలయం ముందు వున్నట్లు కనుగొన్నారు.
 
తలను స్వాధీనం చేసుకుని మృతుడి మొండెంను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నట్లు వెల్లడైంది. ఓ యువకుడిని హత్య చేసి అతడి తలను అదే గుడి వద్ద పడేసిన ఆరోపణల్లో మృతుడు నిందితుడుగా వున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments