Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 24 ఆగస్టు 2025 (14:27 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో 17 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు కామాంధులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ బాలిక కొత్తగూడెం ఏజెన్సీలోని చర్ల మండలంలోని తన బంధువుల ఇంటికి శనివారం ఆమె వచ్చింది. ఈ క్రమంలో ఆటోలోని ఇతర డ్రైవర్లు ఆమెకు శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఆటోలో కిడ్నాప్ చేశారు. ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక శరీరంపై గాయాలు, పంటిగాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రోహిత్ రాజు.. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments