Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

Advertiesment
suicide

ఠాగూర్

, ఆదివారం, 17 ఆగస్టు 2025 (09:33 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబ కలహాల కారణంగా తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గుంటూరు సాయిబాబా కాలనీలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, షేక్ యూసఫ్ తన భార్యతో గొడవపడి, ఇద్దరు పిల్లలను తీసుకుని గుంటూరులోని తన సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ తన పిల్లలను హుస్సేన్, ఆరిఫ్‌లకు ఎలుకల మందు పెట్టి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంగారెడ్డి ఫామ్ హౌస్ పార్టీలో మాదకద్రవ్యాల వినియోగం.. 51మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్ట్