Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మరో ఘోరం.. నాలుగేళ్ల చిన్నారిపై నీచం

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (22:56 IST)
నగరంలో మరో దారుణ ఘటన జరిగింది. అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై నీచానికి పాల్పడ్డాడో కామాంధుడు. స్థానికులు గమనించి నిందితుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
 
సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన మరువక ముందే నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన దుర్మార్గుడు అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై నీచానికి ఒడిగట్టిన దారుణ ఘటన చోటుచేసుకుంది.

పాతబస్తీలోని ఛత్రినాక పోలీస్ స్టేషనర్ ఏరియా కందికల్ గేట్ క్రాంతి నగర్‌ ప్రాంతానికి చెందిన చిన్న నర్సింగ్(32) అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో అదను చూసి చాక్లెట్ ఇప్పిస్తానని చిన్నారిని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా గమనించిన స్థానికులు నర్సింగ్‌ను పట్టుకుని చితకబాదారు.

పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిన్నారిపై నీచానికి పాల్పడిన నిందితుడిని స్థానికులు చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది."

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments