Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (15:04 IST)
విజయవాడ నగరంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. ఒక కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు మృతదేహాలుగా కనిపించారు. ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు ఉండగా, ఇంటి బయట మరో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఉరేసుకున్న వ్యక్తి డాక్టర్ కావడం గమనార్హం. కుటుంబ సభ్యులను హత్య చేసి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 
 
విజయవాడ పట్టణంలో ఆర్థోపెడిక్ నిపుణుడైన డాక్టర్ శ్రీనివాస్ విజయవాడలోని శ్రీజ అనే ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. ఆయన తన కుటుంబంతో కిసి గురునానక్ కాలనీలో ఉంటున్నారు. ఈయనకు భార్య ఉష (38), తల్లి రవణమ్మ (65), ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహాన్ (8)లు ఉన్నారు. వీరిలో రవణమ్మ, ఉష, శైలజ, శ్రీహాన్‌లు ఇంటిలో రక్తపుమడుగులో విగతజీవుల్లో కనిపించారు. 
 
శ్రీనివాస్ మాత్రం ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్లే ఆయన తన ఆస్పత్రిని లీజుకిచ్చారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి ఐదు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments