యజమాని భార్యతో వివాహేతర సంబంధం: ప్రియురాలితో పిలిపించి హత్య చేసి అడవిలో పడేశారు

ఐవీఆర్
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (12:41 IST)
తన మాజీ యజమానితో డబ్బు వివాదం, అతని భార్యతో వివాహేతర సంబంధం కలిగిన 22 ఏళ్ల రెస్టారెంట్ ఉద్యోగి హత్యకు గురయ్యాడు. ఈ దారుణం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లోని ప్రముఖ హోటల్లో సచిన్ కుమార్ అనే 22 ఏళ్ల వ్యక్తి వెయిటర్‌గా పనిచేసేవాడు.
 
ఇతడు తన యజమాని అయిన హషీబ్ ఖాన్ నుంచి రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. యజమాని భార్య అయిన షబీనా బేగంతో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని యజమాని ఎంతగా అడిగినా అతడు ఇవ్వకుండా ముఖం చాటేస్తూ వచ్చాడు. దీనితో హషీబ్ ఖాన్ తన భార్య ద్వారా సచిన్ ను ఇంటికి పిలిపించాడు. ఆ తర్వాత అతడిపై కత్తి దాడి చేసి హత్య చేసాడు.
 
కుమార్ గత ఆదివారం కన్నాట్ ప్లేస్ నుండి అదృశ్యమవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కాల్ డేటాను పరిశీలించారు. అతని కాల్ వివరాలు సంగమ్ విహార్‌లోని అతని చివరి ప్రదేశాన్ని వెల్లడించాయి. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా సచిన్‌ ఇంతకుముందు ఉద్యోగంలో చేర్చుకున్న హషీబ్ ఖాన్‌ వుండే ప్రదేశంగా కనుగొన్నారు. దీనితో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా అసలు నిజం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

తర్వాతి కథనం
Show comments