Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవన భాగస్వామిని.. ఆమె ప్రియుడిని చంపేసిన హత్య.. కాకినాడలో జంట హత్యల కలకలం...

ఠాగూర్
బుధవారం, 20 మార్చి 2024 (12:44 IST)
wకాకినాడలో జంట హత్యలు కలకలం సృష్టించాయి. సహజీవన భాగస్వామితో పాటు.. ఆమె ప్రియుడిని ఓ వ్యక్తి చంపేశాడు. ఈ అక్రమ సంబంధాన్ని ప్రోత్సహించిందన్న కోపంతో వృద్దురాలైన మహిళ తల్లిపై కూడా దాడిశారు. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చోబ్రోలు శివారులోజరిగింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
చేబ్రోలు గ్రామానికి చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోవమ్మ, లోక నాగబాబు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల పోసిన శ్రీనుతో లోవమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది.
 
ఈ విషయం తెలియడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని శ్రీను, లోవమ్మలపై కత్తితో పొడిచి చంపేశాడు. అక్రమ సంబంధానికి సహకరించిందనే ఉద్దేశంతో లోవమ్మ తల్లి రామలక్ష్మిపైనా నాగబాబు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ రామలక్ష్మిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. కాగా, విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments