Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన దారుణం.. బిర్యానీకి డబ్బులు ఇవ్వలేదని 60 కత్తిపోట్లు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (13:22 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బిర్యానీకి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ బాలుడుని మరో బాలుడు 60 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. మృతుడి వయసు 17 యేళ్లు కాగా, ఈ దారుణానికి పాల్పడిన బాలుడి వయసు 16 యేళ్లు. యువకుడు మెడ, ఛాతిపై 60 సార్లు కత్తితో పొడవడంతో చనిపోయాడు. ఆ తర్వాత నిర్జీవంగా పడివున్న ఆ బాలుడిపై కిరాతక బాలుడు డ్యాన్స్ చేశాడు. ఈ దారుణం మంగళవారం రాత్రి జరిగింది. 
 
ఢిల్లీలోని జాఫ్రాబాద్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ కుమారుడు జనతా మజ్దూర్ కాలనీలో నడిచి వెళుతుండగా, 16 యేళ్ల బాలుడు బిర్యానీ కోసం రూ.350 ఇవ్వాలని బెదిరించాడు. ఈ మొత్తం డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన 16 యేళ్ళ బాలుడు కత్తితో దాడి చేశాడు. 
 
దీంతో కిందపడిపోయిన బాధితుడిపై కూర్చొని 60 సార్లు మెడపై, ఛాతిపై కత్తితో పొడిచాడు. ఫలితంగ తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మృతదేహంపై నిలబడి డ్యాన్స్ చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడు చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిపై గతంలోన ఓ హత్య కేసు ఉందని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments