Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాగ్రామ్‌లో లైకుల పోటీ.. ఇద్దరిని చంపేశారు...

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (17:09 IST)
ఇన్‌స్టాగ్రామ్‌లో లైకుల పోటీ కారణంగా ఇద్దరు హత్యకు గురయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు వచ్చిన లైకులు, కామెంట్స్‌పై జరిగిన వాదన ఈ జంట హత్యలకు దారితీశాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీ నగర శివారు ప్రాంతమైన ఔటర్‌లోని బల్స్వా డైరీలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైవుండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు హత్యా స్థలానికి వచ్చి మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో మృతులను సాహిల్, నిఖిల్ అనే వారిగా గుర్తించారు. పైగా, ఈ కేసులో ఓ బాలికతో పాటు ఆమె మైనర్ సోదరుడుతో సహా మొత్తం నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. అలాగే, జంట హత్యల కోసం వినియోగించిన ఇద్దరు ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వ్యాఖ్యపై ఓ యువతికి నిఖిల్‌కు మధ్య గొడవ జరిగింది. ఆన్‌లైన్ కాదు వీధిలోకి వచ్చి మీ ధైర్యాన్ని చూపండి అంటూ సవాల్ విసిరింది. దీంతో నిఖిల్ సాహిల్‌తో కలిసి అర్థరాత్రి సమయంలో ఆ యువతి ఉండే ప్రాంతానికి వచ్చాడు. ఈ విషయం బాలికకు చేరవేయగా, ఆమెతన పాటు మరికొందరిని పిలుచుకుని వచ్చి 26 యేళ్ల నిఖిల్, 19 యేళ్ల సాహిల్‌లను చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ జంట హత్య కేసులతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేశారు. కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments