Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాళేశ్వరం స్కామ్‌ను హైలైట్ చేసేందుకు ఢిల్లీకి వచ్చాను.. వైఎస్ షర్మిల

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (15:57 IST)
YS Sharmila
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ టూర్ చేపట్టారు. ఈ సందర్భంగా హస్తినలో షర్మిల మాట్లాడుతూ.. భారతదేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాన్ని హైలైట్ చేయడానికి తాను ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుంభకోణం చాలా పెద్దదని చెప్పారు. 
 
ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖజానాకు ఖర్చయ్యే డబ్బు రూ1.2 లక్షల కోట్ల మొత్తం చేరిందన్నారు. ఈ ప్రాజెక్టు కింద స్కామ్ జరిగిందని.. కేసీఆర్ సర్కారుపై షర్మిల మండిపడ్డారు. 
 
ఇకపోతే.. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆస్తులు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై వైఎస్ షర్మిల శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులతో సమావేశమై ఫిర్యాదు చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్ షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అనేక అక్రమాలు జరిగాయని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల అక్రమాలు జరిగాయని ఆమె ఆరోపించారు. వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

లక్ష రూపాయలు గెలుచుకోండంటూ డియర్ కృష్ణ వినూత్న కాంటెస్ట్

మూడు భాషల్లో ఫుట్ బాల్ ప్రేమికుల కథ డ్యూడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments