భార్యతో గొడవ: ఫేస్ బుక్ లైవ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న భర్త

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (19:05 IST)
మొన్న భార్యను వేధించి ఉరేసుకుంటున్న వీడియోను తీసిన భర్త... ఈరోజు భార్య వేధింపులు తట్టుకోలేక ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్న భర్త. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన భాస్కర్ ఇల్లరికం ఉంటున్నాడు. భాస్కర్‌కు భార్య సోనితో విభేధాలున్నాయి. స్థానికంగా ఒక ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌కు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు.
 
భాస్కర్ స్వస్థలం గుంటూరు జిల్లా. వివాహమైన తరువాత మదనపల్లికి మకాం మార్చి ఇక్కడే ఉంటున్నాడు. అయితే తరచూ భార్య సోని గొడవలు వేసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోవడం.. వేరొకరితో ఉన్నట్లు భాస్కర్‌కు అనుమానం రావడంతో ఆవేదనకు గురయ్యాడు.
 
దీంతో మనస్థాపానికి గురై ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వెళ్ళేవాడు. తరచూ మద్యం తాగడంతో సోని తల్లిదండ్రులు కూడా భాస్కర్‌ను మందలించారు. ఇలా చేస్తే సోనిని కాపురానికి పంపించమని చెప్పారు. దీంతో మరింత ఆవేదనకు గురైన భాస్కర్ ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు.
 
తను ఉరి వేసుకుంటున్న వీడియోను ఫేస్ బుక్‌లో ఉంచాడు. ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేసి పెట్టి మరీ ఉరేసుకున్నాడు. అంతకుముందు తన చావుకు ఎవరెవరు కారణం అన్న విషయాన్ని తెలియజేస్తూ ఒక సెల్ఫీ వీడియోను కూడా తీశాడు. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments