మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు వరకట్నం వేధింపుల తోనూ, వివాహేతర సంబంధాలతోనూ మంటగలిసిపోతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాల్సిందిపోయి.. వారి మధ్య తలెత్తే గొడవలు ఏకంగా హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ సనత్‌నగర్‌లో నవవధువు హత్యకు గురైంది.
వివరాల్లోకి వెళితే.. సనత్‌నగర్ పరిధిలోని భరత్‌నగర్‌లో నవ వధువు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. భర్త గంగాధర్ భార్య గొంతు నులిమి చంపేసినట్లు వెల్లడించారు. ఇందుకు భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఘర్షణే కారణమని తేలింది.
భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవ కారణంగా కోపంతో రగిలిపోయిన గంగాధర్.. భార్య మానసను గొంతు నులిమి హత్య చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.