Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురుగ్రామ్‌లో దారుణం... టెన్త్ విద్యార్థినిపై ఐదుగురి సాముూహిక అత్యాచారం

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2022 (10:11 IST)
హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలికను కామాంధులైన ఇద్దరు స్నేహితులు బలవంతంగా బైకుపై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ మరో ముగ్గురు కామాంధులతో కలిసి అత్యాచారనికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక... రాత్రిపొద్దుపోయినా ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. 
 
ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆ బాలిక ఇంటి సమీపంలో కనిపించింది. ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. తన ఇద్దరు స్నేహితులు బైకుపై హోటల్‌కు తీసుకెళ్లారని, అక్కడ మరో ముగ్గురుతో కలిసి అత్యాచారం చేశారంటూ బోరున విలపిస్తూ చెప్పింది. 
 
పైగా, ఈ విషయం బయటకు చెప్పొద్దంటూ, చెబితే చంపేస్తామని హెచ్చరించారని తెలిపారు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మరోముగ్గురి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments