Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 31 జనవరి 2025 (14:38 IST)
వైద్యం వికటించి ఓ వృద్ధుడు మృతి చెందగా, దీనిపై నిల దీసిన ఆయన కుమార్తెపై వైద్యుడు దాడి చేయడంతో ఆమె కూడా మృతి చెందింది. దీంతో ఇద్దరి మృతదేహాలనూ వారింట్లోనే వదిలి, ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. తండ్రీకూతుళ్ల అదృశ్యంపై బంధువులు ఫిర్యాదు చేయగా, మూడు నెలల అనంతరం ఇంటి తాళాలు పగలగొట్టి తండ్రీకూతుళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుమార్తె కాల్‌డేటా ఆధారంగా వైద్యుడిని ఆదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారణ జరపడంతో అసలు గుట్టు బయటపడింది. 
 
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర శివారు ప్రాంతమైన తిరుముల్లైవాయిల్‌‍లో వెలుగు చూసిన ఈ క్రైమ్ స్టోరీ వివరాలను పరిశీలిస్తే, వేలూరు జిల్లాకు చెందిన శంకర్ (73), ఆయన కుమార్తె సింధియా (35)లు కలిసి గత నాలుగు క్రితం తిరుముల్లైవాయిల్ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శంకర్ మూత్రాశయ వ్యాధితో బాధపడుతుండటంతో సింథియా తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పాత మహాబలిపురంరోడ్డు (ఓఎమ్మార్)కు చెందిన డాక్టర్ సామవేల్‌ను ఇంటికే పిలిపించి చికిత్స చేయించింది. 
 
ఓ రోజు సింధియా తండ్రికి డయాలసిస్ చేస్తుండగా ఆయన మృతి చెందాడు. తప్పుడు చికిత్స వల్లే తండ్రి మరణించాడని సింథియా డాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం కాస్తా వారి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో సింధియా కిందపడి. తలపగలడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ హఠాత్పరిణామంతో ఆందోళన చెందిన డాక్టర్ సామవేల్ తండ్రీకూతుళ్ల మృతదేహాలను వారింట్లోనే ఇంటిలోనే ఉంచి, దుర్వాసన రాకుండా కొన్ని రసాయనాలను చల్లి, ఇంటికి తాళం వేసి పారిపోయాడు. 
 
అయితే, మూడు నెలలుగా తండ్రీకూతుళ్ల సమాచారం తెలియకపోవడంతో బంధు వులు పలుచోట్ల వెతికారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం తిరుముల్లైవాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గురువారం ఉదయం తిరుముల్లైవాయిల్ వద్ద శంకర్ నివసించిన ఇంటి తలుపులను పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా, కుళ్లిన శవాలు కనిపించాయి. 
 
మృతదేహాలను పోస్టుమార్టంకు పంపిన పోలీసులు, సింధియా మొబైల్‌ఫోనులో కాల్ రికార్డును పరిశీలించారు. డాక్టర్ సామవేల్‌తో ఆమె నిత్యం మాట్లాడినట్లు తెలుసుకున్న పోలీసులు... ఓఎమ్మార్‌లోని ఓ ఇంట్లో దాగివున్న అతడిని అరెస్టు చేసి విచారించగా జరిగిన దారుణం బయటపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments