ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కుమారుడు రాకీ ఫ్లింటాఫ్, క్రికెట్‌లో చరిత్ర సృష్టించడం ద్వారా తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్ లయన్స్ తరపున ఆడుతున్న 16 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ జట్టు తరపున సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా (16 సంవత్సరాల 291 రోజులు) తన తండ్రి రికార్డును అధిగమించాడు.
1998లో కెన్యాపై సెంచరీ చేసిన ఆండ్రూ ఫ్లింటాఫ్ 20 సంవత్సరాల 18 రోజుల వయసులో మునుపటి రికార్డును నెలకొల్పాడు. ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత, క్రికెట్ ఆస్ట్రేలియా XIపై అద్భుతమైన సెంచరీతో రాకీ ఈ మైలురాయిని బద్దలు కొట్టాడు.
ఇంగ్లాండ్ లయన్స్ 7 వికెట్లకు 161 పరుగుల వద్ద కష్టపడుతున్నప్పుడు రాకీ ఫ్లింటాఫ్ తొమ్మిదవ స్థానంలో సవాలుతో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 124 బంతుల్లో 108 పరుగులు చేసి, తన జట్టుకు అండగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ ద్వారా ఇంగ్లాండ్ లయన్స్ మొత్తం 316 పరుగులు చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా క్రికెట్ ఆస్ట్రేలియా XI జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 214 పరుగులకే ఆలౌట్ అయింది. రాకీ సహకారంతో ఇంగ్లాండ్ లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగుల ఆధిక్యం సాధించింది.