Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాలో పరిచయమైన వ్యక్తి: ఢిల్లీ హోటల్ గదిలో బ్రిటన్ యువతిపై అత్యాచారం

ఐవీఆర్
శుక్రవారం, 14 మార్చి 2025 (16:56 IST)
భారతదేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలోని అందాలను తిలకించి వెళ్దామని వచ్చిన ఓ బ్రిటన్ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఒక వ్యక్తి ఇన్ స్టాగ్రాంలో పరిచయం కాగా మరో వ్యక్తి హోటల్ హౌస్ కీపింగ్ చేసే వ్యక్తిగా తేలింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలను చూస్తే... నెల రోజుల క్రితం బ్రిటన్ నుంచి ఓ యువతి వచ్చింది. ఈమె మహారాష్ట్రంలో చూడదగిన ప్రదేశాలను చూస్తూ అక్కడే దాదాపు నెల రోజులుగా వుంటూ వచ్చింది. అనంతరం గోవా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నది. ఐతే ఇటీవలే తనకు ఇన్ స్టాగ్రాంలో పరిచయమైన 24 ఏళ్ల కైలాష్ అనే యువకుడు ఢిల్లీలో వుండటంతో అతడిని కూడా ఒక్కసారి కలిసి వెళ్దామనుకుని ఢిల్లీలో తను బస చేస్తున్న మహిపాల్ పూర్ ప్రాంతంలోని హోటల్ చిరునామా చెప్పింది. అతడు వచ్చేలోగా హోటల్ గదికి చేరుకుందామని వెళ్లింది.
 
ఐతే గదికి చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కగానే లిప్టులో వున్న హోటల్ బోయ్ ఆమెపై అత్యాచార యత్నం చేసాడు. ఐతే అతడి నుంచి ఎలాగో తప్పించుకుని గదికి చేరుకుంది. ఇంతలో కైలాష్ వచ్చాడు. ఆమె అతడితో మాట్లాడి... వచ్చినవాడు తనకు తెలిసినవాడేనని నిర్థారించుకుని లోపలికి ఆహ్వానించింది. ఇదే అదనుగా భావించిన కైలాష్... ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరిగిన ఈ రెండు అఘాయిత్యాలపై బాధితురాలు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments