Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు లక్షల బంగారం, రెండు లక్షల నగదుతో ప్రియుడి బైక్ పైన వధువు జంప్

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (19:53 IST)
మరికాసేపట్లోనే పెళ్ళి. ఇక మండపంలోకి పెళ్ళి కూతుర్ని తీసుకు రావాల్సిన సమయం. ఆమెను తీసుకురండి అన్నాడు పండితులు. మంత్రాలు చదువుతూ ఉండడం.. పెళ్ళి సందడి నెలకొంటే ఇంతలో గట్టిగా అరుపులు. పెళ్ళి కూతురు గదిలో లేదని...
 
చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె మండలం బురుజుపల్లెకు చెందిన ఒక యువతికి పెళ్ళి నిశ్చయించారు. ఈ నెల 7వ తేదీన నిశ్చితార్థం కూడా జరిగింది. వరుడు ఉన్న ప్రాంతం అనంతపురం జిల్లా పూలుకుంట మండలం కమ్మలవారి బురుజు. వివాహం కోసం అనంతపురం నుంచి నిన్న వచ్చారు.
 
కట్నం ఇచ్చేందుకు పెళ్ళికూతురు తండ్రి 2 లక్షల రూపాయలు తెచ్చిపెట్టాడు. పెళ్ళి కూతురు ఒంటిపై ఐదు లక్షల రూపాయల విలువ చేసే నగలు కూడా ఉన్నాయి. మరో గంటలో పెళ్ళి అనగా చీర మార్చుకుని రమ్మని పెద్దలు చెప్పారు. అంతే గదిలోకి వెళ్ళిన పెళ్ళి కూతురు కనిపించకుండా పోయింది. నగలు, నగదును తీసుకుని వెళ్ళిపోయినట్లు బంధువుల గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
స్థానికంగా ఉన్న సి.సి. ఫుటేజ్‌లో పరిశీలించగా ఒక యువకుడితో కలిసి ఆమె మోటారు సైకిల్ పైన వెళుతుండగా పోలీసులు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వరుడు లబోదిబోమంటూ అనంతపురం వెళ్ళిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments