Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేనమామతో ప్రేమ - షూటర్లతో భర్తను చంపించిన నవ వధువు

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (12:18 IST)
తన మేనమామతో ఉన్న ప్రేమకు దూరం కాలేని ఓ నవ వధువు.. పెళ్లయిన 45 రోజులకే కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఈ హత్య కేసులో ఆమె మేనమామ కూడా పాలుపంచుకున్నాడు. ఈ దారుణం బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్‌ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఔరంగాబాద్ జిల్లాలోని బర్వాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల ప్రియాన్షుకు రెండు నెలల క్రితం గుంజాదేవి అనే యువతితో వివాహమైంది. అయితే, గుంజా దేవికి తన మేనమామ అయిన జీవన్ సింగ్ (55)తో పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా వారి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో గుంజాదేవి కుటుంబం ఆమెకు ఇష్టం లేకుండా ప్రియాన్షుతో బలవంతంగా పెళ్లి జరిపించింది.
 
భర్తతో కాపురం ఇష్టం లేని గుంజాదేవి, అతడిని అడ్డు తొలగించుకోవాలని మేనమామ జీవన్ సింగ్‌తో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో జూన్ 25న ప్రియాన్షు తన సోదరి ఇంటికి వెళ్లి రైలులో తిరిగి వస్తున్నాడు. నవీ నగర్ స్టేషనులో దిగిన తర్వాత తనను ఇంటికి తీసుకెళ్లేందుకు బైకుపై ఎవరినైనా పంపమని భార్య గుంజాదేవికి ఫోన్ చేసి చెప్పాడు.
 
ప్రియాన్షు స్టేషన్ నుంచి ఇంటికి బైకుపై వస్తుండగా, మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు అతడిని అడ్డగించి కాల్చి చంపారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. భర్త చనిపోయిన తర్వాత గుంజాదేవి ప్రవర్తనపై ప్రియాను కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె గ్రామం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో వారి అనుమానం మరింత బలపడింది. 
 
పోలీసులు గుంజా దేవి కాల్ రికార్డులను పరిశీలించగా, ఆమె తన మేనమామ జీవన్ సింగ్‌తో నిరంతరం ఫోనులో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత జీవన్ సింగ్ కాల్ డేటాను విశ్లేషించగా, అతను షూటర్లతో సంప్రదింపులు జరిపినట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.
 
ఈ హత్య కేసును ఛేదించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశామని ఎస్పీ అమ్రిష్ రాహుల్ మీడియాకు తెలిపారు. "ప్రియాన్షు, గుంజా దేవిల పెళ్లి జరిగిన 45 రోజులకే ఈ హత్య జరిగింది. ఈ కేసులో గుంజా దేవితో పాటు ఇద్దరు షూటర్లను అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న ఆమె మామ జీవన్ సింగ్ కోసం గాలిస్తున్నాం" అని ఎస్పీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments