ప్రియురాలి కొత్త ప్రియుడిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు..

ఠాగూర్
మంగళవారం, 19 ఆగస్టు 2025 (09:05 IST)
ఐటీ నగరం బెంగుళూరు సిటీలో ప్రేమ వ్యవహారం తీవ్ర ఘర్షణకు దారితీసింది. తన మాజీ ప్రియురాలు మరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని సహించలేని ఓ యువకుడు, ఆమె కొత్త లవర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడగా, పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే, విజయ నగర్‌కు చెందిన చందన్ గౌడ (25) అనే యువకుడిపై ఈ దాడి జరిగింది. ఆగస్టు 15వ తేదీ రాత్రి ప్యాలెస్ గుట్టహళ్లిలోని జటకా స్టాండ్ సమీపంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, సేల్స్‌‌మన్‌గా పనిచేస్తున్న యతీష్ (26) గతంలో ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే, వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె అతడితో సంబంధం తెంచుకుంది. గత మూడు నెలలుగా ఆమె చందన్ అనే కుర్రాడితో స్నేహం చేస్తోంది.
 
ఈ విషయాన్ని జీర్ణించుకోలేని యతీష్, ఆమెతో తిరిగి కలవాలని ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో చందనపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. పథకం ప్రకారం, ఆగస్టు 15న తన సోదరుడు హర్ష (23), మరికొందరు స్నేహితులతో కలిసి చందన్‌పై దాడికి దిగాడు. అతని ఛాతీ, కడుపు భాగంలో కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు.
 
దాడి జరిగిన వెంటనే చందన్ తన బంధువు ప్రజ్వల్ ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రజ్వల్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న చందన్‌ గౌడ సమీపంలోని ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం చందన్‌కు  శస్త్ర చికిత్స పూర్తయిందని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. 
 
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యాయత్నం ఆరోపణలపై యతీష్, హర్షను ఆదివారం అరెస్టు చేశారు. ఈ దాడిలో పాల్గొన్న ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments