Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంక్ మేనేజర్ కాల్చివేత: జమ్మూకాశ్మీరులో వణుకుతున్న గవర్నమెంట్ ఉద్యోగులు

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (13:56 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో గురువారం ఉదయం జరిగిన మరో దాడిలో బ్యాంక్ మేనేజర్ కాల్చి చంపబడ్డారని అధికారిక వర్గాలు తెలిపాయి. కుల్గామ్‌ లోని అరేహ్‌లో ఎల్లకై దేహతి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారని వారు తెలిపారు.

 
"దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించబడ్డాడు, అక్కడ వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు" అని అధికారిక వర్గాలు తెలిపాయి. హనుమాన్‌గఢ్ రాజస్థాన్‌కు చెందిన కుమార్, ఒక వారం క్రితమే ఆ ప్రాంతంలో నియమించబడ్డాడు. ఈ ఉగ్రదాడి ఘటనలో బ్యాంకు మేనేజర్‌కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

 
దాడి జరిగిన వెంటనే, దాడి చేసిన వారి జాడ కోసం భారీ వేట ప్రారంభించారు. సాంబ జమ్మూకి చెందిన రజనీ బాలా అనే 36 ఏళ్ల పాఠశాల ఉపాధ్యాయిని అదే జిల్లాలో కాల్చి చంపిన రెండు రోజుల తర్వాత తాజాగా ఈ హత్య జరిగింది. మే నెల నుంచి కశ్మీర్‌లో మైనారిటీలపై లక్షిత దాడులు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో 1000 వాలా టీజర్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments