Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉద్యోగులు జగనన్న ప్రభుత్వానికే అండగా ఉంటారు!

Advertiesment
ఉద్యోగులు జగనన్న ప్రభుత్వానికే అండగా ఉంటారు!
విజ‌య‌వాడ‌ , సోమవారం, 6 డిశెంబరు 2021 (16:02 IST)
ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయచ్చు కాని, ప్రభుత్వాన్ని కూల్చుతాం అనడం సబబుగా లేద‌ని ప్రభుత్వ సలహాదారు నలమారు చంద్ర శేఖర్ రెడ్డి చెప్పారు. అయినా వార‌లా అని ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, ఎందుకంటే తాను వారితో మొన్నటి వరకు కలిసి పనిచేసి ఉన్నాన‌ని చెప్పారు. 

 
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజలందరి మన్నలు పొంది వచ్చిన ప్రభుత్వం అని, సీఎం ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తార‌ని అన్నారు. కరోనా మహమ్మారి వలన ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంద‌ని, ఉద్యోగులకు రావలసిన రాయితీలు సకాలంలో అందలేద‌న్నారు. కాని ముఖ్యమంత్రి ఎల్లప్పుడు ఉద్యోగుల పక్షపాతి అని, ఆయన రాగానే అడగక పోయినా 27 శాతం మధ్యంతర  భృతిని మంజూరు చేయడంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప‌విష‌యం అన్నారు. 
 
 
స‌చివాలయాలలో అతి తక్కువ కాలంలో లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులను పారదర్శకంగా నియమించడం ఘ‌న‌త అని చెప్పారు. త్వరలోనే 11వ పి.ఆర్.సి ని ఇవ్వాలని ముఖ్యమంత్రి  అధికారులను ఆదేశించార‌ని, మనందరి కోసం కష్టపడి పని చేస్తున్నజగనన్నకు అండగా నిలుద్దామ‌ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పిలుపునిచ్చారు.


ముఖ్యమంత్రిని ఉద్యోగస్తులు ఎల్లప్పుడు తమ కుటుంబ పెద్దగా గౌరవిస్తార‌ని, ఏదైనా బాధ కలిగినప్పుడు ఉద్యోగులు బాధను వ్యక్తం చేస్తారే తప్ప, ప్రభుత్వానికి వ్యతిరేకం కాద‌న్నారు. అయితే కొంత మంది దానిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నార‌ని, అలాంటి వారిని తిప్పికొట్టాల‌న్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి