Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిధులు ప్రజలకు పంచాలా? ఉద్యోగులకు ఇవ్వాలా? అని కించపరిచారు

నిధులు ప్రజలకు పంచాలా? ఉద్యోగులకు ఇవ్వాలా? అని కించపరిచారు
విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (11:36 IST)
‘ప్రభుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై స్పందన లేకపోవడంతో పాటు, అవహేళన చేస్తూ, మాలో కొందర్ని కించపరిచేలా మాట్లాడడం బాధ కలిగించింద‌ని ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నిధుల్ని 90 శాతం ప్రజలకు పంచాలా? లేక ఉద్యోగులకు ఇవ్వాలా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడటం మమ్మల్ని కించపరచడమేన‌న్నారు. 
 
 
ప్రజలకు, మాకు మ‌ధ్య ఎందుకు చిచ్చుపెడుతున్నారు? వేతనం ఆలస్యమయినా, అనేక ఇబ్బందులున్నా భరించాం. ఇంత జరుగుతున్నా సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదు? సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అనుభవలేమితో మాట్లాడుతున్నారు. తొలుత నివేదిక లేకుండానే పీఆర్‌సీ ఇస్తుందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వానికి డిసెంబరు 10 వరకూ సమయం ఇస్తున్నట్లు చెప్పారు’ అని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. 
 
 
ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, వైవీ రావు మాట్లాడుతూ, ‘ఆర్థిక మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఆయన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. పీఆర్‌సీ కోసం మూడున్నరేళ్లు ఓపిక పట్టినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరం. ఉద్యోగుల సమస్యలు నానాటికీ పెరుగుతుండటం ప్రభుత్వానికి ఆనందం కలిగిస్తుందా? సీపీఎస్‌ రద్దు హామీ అమలవలేదు. కారుణ్య నియామకాల్ని నవంబరు 30లోపు పూర్తి చేయాలని ఆదేశాలున్నా, ఒక్క శాతం కూడా జరగలేదు. ముఖ్యమంత్రి సీరియస్‌గా పరిగణించడం లేదని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
 
 
అయితే, పీఆర్‌సీ అంశాన్ని వారంలోపు పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ వ్యవహారాలు) చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వేతన సవరణ అమలుపై సంబంధిత ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉస్మానియా క్యాంపస్‌లో సమాధి...