Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టపగలు ఆస్పత్రిలో దారుణం... అందరూ చూస్తుండగా విద్యార్థిని గొంతు కోసేశాడు...

ఠాగూర్
మంగళవారం, 1 జులై 2025 (11:38 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగ్ పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. పట్టపగలు, అందరూ చూస్తుండగానే ఓ కిరాతకుడు 19 యేళ్ల విద్యార్థిని గొంతు కోసేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది, రోగులు, రోగుల సహాయకులు కూడా చూస్తూ నిశ్చేష్టులై ఉండిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నర్సింగ్ పూర్‌కు చెందిన 19 యేళ్ళ ఇంటర్ విద్యార్థిని ఈ నెల 27వ తేదీన ఆస్పత్రికి వచ్చింది. ప్రసూతి వార్డులో ఉన్న స్నేహితురాలి బంధువును చూసేందుకు వెళుతున్నాని ఇంట్లో చెప్పి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బయలుదేరింది. అయితే, ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో అభిషేక్ అనే సైకో వేధిస్తున్నాడు. 
 
ఆ యువతి ఆస్పత్రికి వచ్చిందని తెలుసుకున్న ఆ కిరాతకుడు.. ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత వార్డు నెంబరు 22వ వద్ద ఒక్కసారిగా దాడి చేసి గొంతుకోశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైద్య సిబ్బంది, రోగుల సహాయకులు నిశ్చేష్టులై చూస్తుండిపోయారు.
 
ఈ దారుణం సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియో ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు రికార్డయ్యాయి. నల్లచొక్కా ధరించిన అభిషేక్... యువతిని చెంపపైకొట్టి కిందపడేశాడు. ఆ తర్వాత ఆమె ఛాతిపై కూర్చొని తనతో వెంట తెచ్చుకుని కత్తితో ఆమె గొంత కోశాడు. ఇంత ఘోరం జరుగుతున్నా అక్కడున్న వారంతా చూస్తూ ఉండిపోయారు. ఆ విద్యార్థిని తీవ్ర రక్తస్రావంతో అక్కడే కన్నుమూసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments