Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికల హాస్టల్ నుంచి అదృశ్యమైన 22 మంది అమ్మాయిలు...

ఠాగూర్
ఆదివారం, 7 జనవరి 2024 (14:50 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ నగర శివారు ప్రాంతంలోని ఓ బాలికల హాస్టల్ నుంచి ఏకంగా 22 మంది విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. భోపాల్ శివారులోని పర్వాలియాలోని బాలికల హాస్టల్ నుంచి ఈ అమ్మాయిలు మిస్ అయ్యారు. ఎస్.సి.పి.సి.ఆర్ చైర్మన్ ప్రియాంక ఆకస్మిక తనిఖీతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయిన అమ్మాయిలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్టు గుర్తించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
పర్వాలియాలోని అంచల్  గర్ల్స్ హాస్టల్ నుంచి తరచుగా అమ్మాయిలు మిస్సింగ్ అవుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఎస్.సి.పి.సి.ఆర్ చైర్మన్ ప్రియంకా ఈ హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు చేయగా, ఇందులో అమ్మాయిలు మిస్సింగ్ మాట వాస్తవమేనని తేలింది. అదేసమయంలో 26 బాలికలను శనివారం పోలీసులు గుర్తించారు. 
 
ఈ ఘటనకు సంబంధించి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (సీడీపీవో) అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ అయ్యాయి. మిస్సయిన 10 మంది అమ్మాయిలను అదమ్‌పూర్ చావ్ని ప్రాంతంలో గుర్తించగా, 13 మందిని ముురికివాడల్లో, ఇద్దరిని టాప్ నగర్‌లో, ఒకరిని రాయ్‌సెన్‌లో గర్తించారు. 
 
చిల్డ్రన్ హోం నుంచి బాలికలు మిస్సయిన విషయం నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎస్‌సీపీసీఆర్) చైర్మన్ ప్రియాంక కనుంగో అకస్మాత్తు సందర్శనతో బయటపడింది. 68 బాలికలు ఉండాల్సిన చోట 26 మంది అమ్మాయిలు కనిపించకుండా పోవడాన్ని గుర్తించారు. వీరందరూ గుజరాత్, ఝార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందినవారే. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఇద్దరు సీడీపీవో అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments