మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న సాత్పురా భవన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు.
భారీగా మంటలు ఎగిసిపడి ఉన్న మిగతా అంతస్తులకు వ్యాపించాయి. దీంతో భవనంలో ఏసీలు, గ్యాస్ సిలిండర్లు కారణంగా పలుసార్లు పేలుళ్లు సంభవించాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ వైమానిక దళ సహాయాన్ని కోరారు.
ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, లోపలి ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు.