అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోమారు తూలిపడ్డారు. కాళ్లు తట్టుుకోవడంతో ఆయన కిందపడ్డారు. కొలరాడాలోని ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో గ్యాడ్యుయషన్ వేడుక సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ వెంటనే అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను పైకి లేపారు. ఆ వెంటనే ఆయన ఎలాంటి సాయమూ లేకుండా తన సీటు వద్దకు వెళ్లి కూర్చొన్నారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని శ్వేతసౌథం కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.
కాగా, జో బైడెన్ తూలిపడిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాదాపు 90 నిమిషాలపాటు జరిగిన ఈ గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమంలో విద్యార్థులకు అమెరికా అధ్యక్షుడు హోదాలో సర్టిఫికేట్లను ప్రదానం చేశారు.
కాగా 80 యేళ్ల వయసులో అమెరికా అధ్యక్షుడై చరిత్ర సృష్టించిన జో బైడెన్... గతంలోనూ పలుమార్లూ ఇలానే తూలిపడ్డారు. ఆయన సొంత రాష్ట్రమైన డెలావర్‌లో బైక్ రైడింగ్ చేస్తూ ఒకసారి కిందపడ్డారు. మరోమారు అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ విమానం ఎక్కుతూ మెట్లపై తూలిపడిన విషయం తెల్సిందే.