Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిది మందిని పెళ్లాడిన కిలేడీ లేడీ... ఎందుకో తెలుసా?

Webdunia
బుధవారం, 12 జులై 2023 (10:47 IST)
తమిళనాడులో ఓ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పలు ప్రాంతాల్లో ఏకంగా ఎనిమిది మందిని వివాహం చేసుకుంది. భర్తలతో కొన్ని నెలల పాటు కాపురం చేసిన నగలు, నగదుతో ఉడాయించి పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్‌ మూర్తికి ఇన్‌స్టాగ్రామ్‌లో రషీద అనే యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ప్రేమించుకుని.. ఈ యేడాది మార్చి 30వ తేదీన వివాహం చేసుకున్నారు. వివాహమైన కొన్ని రోజులకే వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
 
ఈ నేపథ్యంలో రషీద ఈ నెల 4వ తేదీన ఇంట్లో ఉన్న రూ.1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారు నగలతో అదృశ్యమైంది. మూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నీలగిరి జిల్లా గూడలూర్‌కు చెందిన రషీద సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరచి డబ్బున్న మగవారితో పరిచయం పెంచుకుంటుందని గుర్తించారు. 
 
తర్వాత వారిని వివాహం చేసుకుంటుందని, కొన్ని రోజుల తర్వాత ఇళ్లలో ఉన్న నగదు, నగలతో పారిపోతుందని తెలుసుకున్నారు. ఆమె ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎనిమిది వివాహాలు చేసుకున్నట్లు తేలింది. పరారీలో ఉన్న ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments