Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

650 ఎంఎల్ వాటర్ బాటిల్‌ ధరెంతో తెలుసా?

Advertiesment
Water
, బుధవారం, 12 జులై 2023 (09:58 IST)
Water
ఇష్టమైన రెస్టారెంట్లలో తినడం అందరికీ బాగా నచ్చుతుంది. ప్రజలు మంచి ఆహారం కోసం అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో కొన్ని ఉత్పత్తుల ధర ప్రమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అందుకు సంబంధించి 650 ఎంఎల్ వాటర్ బాటిల్‌కు రూ.350 వసూలు చేసిన ఘటనపై యువతి ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ విషయమై రితికా బోరా అనే యువతి ఓ హైక్లాస్ రెస్టారెంట్‌లో తనకు ఎదురైన అనుభవం గురించి ట్విట్టర్ పోస్ట్‌లో చెప్పింది. 'మీరు నమ్మరు, నేను లంచ్ కోసం ఒక హై-ఎండ్ రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు, 650 ఎంఎల్ వాటర్ బాటిల్‌కు రూ. 350 వసూలు చేశారు. నేను వాటర్ బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసాను. 
 
ఎందుకంటే నేను దానిని తిరిగి ఉపయోగించగలను. తన పోస్ట్‌లో వాటర్ బాటిల్ ఫోటోను కూడా షేర్ చేసింది. ఇది సహజమైన మినరల్ వాటర్ అని, హిమాలయ రాజ్యమైన భూటాన్ నుండి తీసుకువచ్చినట్లు" బోరా పేర్కొంది. 10వ తేదీన షేర్ చేసిన ఈ పోస్ట్‌ను 5 లక్షల మందికి పైగా వీక్షించారు. 4 వేల మందికి పైగా లైక్ చేసి తమ కామెంట్లను పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకి రూ.10122 కోట్లు, బీఆర్ఎస్‌కు రూ.300 కోట్ల విరాళాలు