Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబోయ్ ఎండలో ఎండలు... ఉడికిపోతున్న ఏపీ

termperature
, శుక్రవారం, 16 జూన్ 2023 (14:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. సూర్య భగవానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. దీంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎండి వేడిమికి ఉడికిపోతున్నారు. నర్సాపురంలో సాధారణంగా కంటే ఏకంగా 7.9 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు, శుక్ర, శనివారాల్లో వడగాలులు జోరుగా వీస్తాయని తెలిపింది. 
 
ఈ యేడాది వేసవి కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 200 మండలాల్లో వడగాలులు వీచాయి. ఫలితంగా ప్రజలు తల్లడిల్లిపోయారు. మరో 220 మండలాల్లో వీటి తీవ్ర అధికంగా ఉన్నట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. మరోవైపు, గురువారం నర్సాపురంలో సాధారణం కంటే 7.9 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. శుక్ర, శనివారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. 
 
ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నర్సాపురం 7.9, విశాఖ, బాపట్లలో 7.1, మచిలీపట్నంలో 6.9, జంగమహేశ్వరంలో 6.4 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
భాగ్యనగరికి రాష్ట్రపతి... నేడు - రేపు ట్రాఫిక్ ఆంక్షలు 
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరికి మరోమారు విచ్చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె హైదరాబాద్ నగరానికి శుక్రవారం రాత్రికి చేరుకుంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ద్వారా బేగంపేట్ విమానాశ్రయంలో దిగనున్న ఆమె అక్కడ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శుక్రవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేసే రాష్ట్రపతి శనివారం ఉదంయ దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడెమీలో జరిగే కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. 
 
పరేడ్ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ చూసిన క్యాడెట్లకు ఆమె తన చేతుల మీదుగా అవార్డులు అందజేస్తారు. స్నేహపూర్వక విదేశీ దేశాల నుంచి వచ్చి వైమానిక దళ అకాడమీలో శిక్షణ పొందిన క్యాడెట్‌లకు ఆమె 'వింగ్స్', 'బ్రెవెట్‌'ను అందజేస్తారు. ఈ వేడుకలో అనేక విమానాల విన్యాసాలు కూడా జరగనున్నాయి. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ముర్ము ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
 
మరోవైపు, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా శుక్ర, శనివారాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సీటీవో జంక్షన్, బేగంపేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, పంజగుట్ట జంక్షన్, ఎన్.ఎఫ్.సి.ఎల్ జంక్షన్లలో ట్రాఫిక్ రూల్స్ అమలు జరుగనున్నాయి. అలాగే శనివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలుంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భాగ్యనగరికి రాష్ట్రపతి... నేడు - రేపు ట్రాఫిక్ ఆంక్షలు