Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడనీ టెక్కీ దారుణ హత్య!

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (12:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. గొంతు, కాలి నరాలు కోసిమరీ హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీలోని శాంతినగర్‌కు చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ బాలాజీ అనే వ్యక్తి పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్. ఈయన ఓ ఐటీ కంపెనీలో టెక్కీగా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, ఓ పాప ఉంది. 
 
అయితే, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి రూ.80 వేలు రుణం ఇచ్చాడు. ఆ తర్వాత మరో వ్యక్తికి కూడా అప్పు ఇచ్చాడు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని ప్రేమ్‌ కుమార్‌తో పాటు మరో వ్యక్తిని అడగసాగాడు. దీంతో అశోక్‌ను చంపాలని ప్రేమ్ కుమార్ పథకం వేశాడు. 
 
శనివారం రాత్రి డబ్బులు ఇస్తామని చెప్పడంతో అశోక్ తన ద్విచక్రవాహనంపై ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు ఒంటరిగా వెళ్లాడు. ఇదే అదునుగా భావించి ప్రేమ్ కుమార్ మరికొంతమంది దుండగులతో కలిసి అశోక్ కుమార్‌ను సమీపంలోని పంచాయతీ కార్యాలయంలో తీసుకెళ్లి గొంతు, చేతిమణికట్లు, గాలి చీలమండల నరాలు కోసి పాశవికంగా హత్య చేశారు. 
 
అయితే తమ బిడ్డు తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో పంచాయతీ కార్యాలయంలో ఒక మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించగా, అశోక్ కుమార్‌గా గుర్తించారు. 
 
తమ బిడ్డను అత్యంత కిరాతంగా హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారంతా కలిసి ప్రేమ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. వారిని పోలీసులు శాంతింపజేశారు. 
 
ఈ హత్యకు పాల్పడింది గంజాయి ముఠా పనిగా పోలీసులు భావిస్తున్నారు. కొత్తగూడెం, ఖమ్మ ప్రాంతాలకు చెందిన వారితో కలిసి ప్రేమ్ కుమార్ ఈ హత్య చేసివుంటారని అనుమానిస్తున్నారు. ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments