Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాణాలు తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం... ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు

medical student
, మంగళవారం, 6 డిశెంబరు 2022 (09:17 IST)
ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం ఓ ప్రాణం తీసింది. తన ప్రియురాలిని ప్రియుడే సర్జికల్ బ్లేడుతో గొంతుకోసి చంపేశాడు. ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఏపీలోని గుంటూరు జిల్లాలో పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృష్ణా జిల్లా పడిమిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తపస్వి విజయవాడలోని ఓ కాలేజీలో బీడీఎస్ తృతీయ సంవత్సరం చదువుతుండగా, జ్ఞానేశ్వర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. 
 
వీరిద్దరి మధ్య పరిచయం పెరగడంతో వీరిద్దరూ కలిసి కొంతకాలంగా గన్నవరంలో కలిసి ఒకే ఇంటిలో ఉంటూ వచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా విడిపోయారు. అప్పటి నుంచి ఆమెను వేధించసాగాడు. దీంతో జ్ఞానేశ్వర్‌పై తపస్వి కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వేధింపులు మాత్రం ఆగలేదు. 
 
ఈ క్రమంలో తక్కెళ్లపాడులో ఉన్న తన స్నేహితురాలికి తన విషయాన్ని తపస్వి వివరించి, బోరున విలపించింది. తపస్వి సమస్య తెలుసుకున్న ఆమె.. మాజీ ప్రేమికుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తన ఇంటికి రమ్మని ఇద్దర్నీ పిలిచింది. దీంతో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురూ కలిసి మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన జ్ఞానేశ్వర్... తన వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడుతో తపస్విపై దాడికి పాల్పడ్డారు. 
 
దీంతో భయపడిపోయిన స్నేహితురాలు కేకలు వేస్తూ ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లింది. అప్పటికే తలుపులు బిగించిన నిందితుడు తపస్వి గొంతు కోశాడు. తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లిన స్థానికులు నిందితుడిని పట్టుకుని చితకబాది బంధించారు. కొనఊపిరితో ఉన్న తపస్విని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నారు. నేరం జరిగిన ప్రదేశానికి, ప్రేమికులకు ఎలాంటి సంబంధం లేదు. మాటల మధ్యలో తాను వేరే పెళ్లి చేసుకోబోతున్నట్టు తపస్వి చెప్పడంతో ఆగ్రహానికిలోనైన జ్ఞానేశ్వర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తుఫానుగా మారనున్న 'మాండస్'