Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తతో గొడవపడి ప్రియుడితో వచ్చేసిన వివాహిత, గంజాయి బిజినెస్ పెట్టి....

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (14:37 IST)
పెళ్ళయ్యింది. ముగ్గురు పిల్లలున్నారు. భర్త ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. సాఫీగా సాగిపోతున్న కుటుంబం. అయితే ఆమె పక్కదారి పట్టింది. ప్రియుడినే సర్వస్వంగా భావించింది. కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ప్రియుడితో సహజీవనం పెట్టింది. ప్రియుడు గంజాయి అమ్ముతూ రెండు చేతులా డబ్బులు సంపాదించడంతో ఆమె కూడా ఆ ఊబిలోకి దిగింది. తన అందంతో వ్యాపారాన్ని మరింత  రెట్టింపు చేసింది.

 
క్రిష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మహిళకు ముగ్గురు పిల్లలున్నారు. భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సాదిక్ అనే యువకుడితో సన్నిహిత సంబంధం పెట్టుకుంది. మొదట్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉండే సాదిక్ ఆ తరువాత గంజాయిని అమ్మడం మొదలెట్టాడు. 

 
గంజాయిని అమ్మడంతోనే డబ్బులు బాగా కూడబెట్టాడు. తన ప్రియురాలిని అన్ని హంగులతో ఉన్న ఇంటికి తీసుకెళ్ళాడు. సకల సౌకర్యాలు కల్పించాడు. దీంతో ఆ వివాహిత కూడా ఇందుకు సహకరించడం ప్రారంభించింది.

 
యువకులకు గంజాయి ఇచ్చేది. ఇలా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగింది. వ్యాపారంలో తమకు తిరుగులేదని భావించింది. ప్రియుడు కూడా గంజాయి వ్యాపారంలో ఆరితేరి పోవడంతో డబ్బులే డబ్బులు. అయితే పోలీసులకు అడ్డంగా దొరికాడు ప్రియుడు. దీంతో కటాకటాల పాలయ్యాడు. పోలీసులు సాదిక్‌ను అరెస్టు చేస్తే తన ప్రియురాలు గురించి కూడా చెప్పేశాడు. దీంతో వివాహితను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments