Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్యను వశపరుచుకుని తీసుకెళ్లిన యువకుడిని కిడ్నాప్ చేసి...

ఐవీఆర్
గురువారం, 27 జూన్ 2024 (17:18 IST)
వివాహేతర సంబంధాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వీటి వెనుక కారణాలు ఏమి వున్నప్పటికీ మారుతున్న సమాజం విలువలు వీటికి అద్దం పడుతున్నాయి. తాజాగా తెలంగాణ లోని నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వివాహిత మరో యువకుడితో ప్రేమలో పడింది. దాంతో తన ముగ్గురు పిల్లల్ని సైతం వదలేసి అతడితో వెళ్లిపోయింది.
 
పూర్తి వివరాలు చూస్తే... దేవరకొండకు చెందిన సతీశ్, అనంత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. ఐతే అనంత గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన ధనుష్ అనే యువకుడితో సన్నిహితంగా వుంటూ వస్తోంది. అది కాస్తా ప్రేమకి దారి తీసి ఇద్దరూ కలిసి ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. తన భార్యను ఎత్తుకెళ్లిపోయిన ధనుష్ ఆచూకి కోసం గత ఏడాదిగా వెతుకుతున్న సతీష్‌కి వారు హుజూరుబాద్‌లో వున్నట్లు తెలుసుకున్నాడు.
 
తన మిత్రుల సహాయంతో కారులో వెళ్లి ధనుష్‌ను కిడ్నాప్ చేసి కేసీ కెనాల్ వద్దకు తీసుకుని వెళ్లి దాడి చేసారు. అటుగా వెళ్తున్న స్థానికులు ఇది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. ఐతే ఆ కారులో ధనుష్ కనిపించలేదు. ఏమయ్యాడని అడిగితే... అతడు తప్పించుకుని పారిపోయాడని చెప్పారు. కానీ... అతడు నిజంగానే తప్పించుకున్నాడా లేదంటే వీరే ఏదైనా చేసి అబద్ధం ఆడుతున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments