Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో కుమార్తెపై అత్యాచార యత్నం చేసిన తండ్రి

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (13:42 IST)
పనీపాటా లేదు. చిల్లరగా తిరగడం.. ఎవరైనా డబ్బులు ఇస్తే తాగి ఇంటికి రావడం ఇదే అతని పని. ఇంట్లో పెళ్ళీడుకు వచ్చిన కూతురు ఉంది. ఆమెకు పెళ్ళి చేయాలి. కొడుకు చదువుకుంటున్నాడు. అతనికి సహకరించాలని భార్య నెత్తి నోరు కొట్టుకుంటున్నా వినిపించుకోని భర్త. తాగి తిరుగుతున్న భర్తను వదిలేసింది. కానీ మద్యం మత్తులో కుమార్తె జోలికి వెళ్ళడంతో జీర్ణించుకోలేకపోయింది. ఆ భర్తను ఏం చేసిందంటే..?

 
చెన్నై సిటీలోని ఒటేరిలోని వజీమానగర్‌లో ప్రదీప్, ప్రీతిలు నివాసముంటున్నారు. వీరికి 20 యేళ్ళ కూతురు, 11 యేళ్ల కొడుకు ఉన్నారు. పెళ్ళయిన పదేళ్ళ పాటు ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ప్రదీప్. అయితే స్నేహితులతో కలిసి గత కొన్ని సంవత్సరాలుగా తాగుడికి బానిసయ్యాడు.

 
తాగుడుతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఉన్న కాస్త ఆస్తితో ఇంటిని గడుపుతూ వస్తోంది భార్య. అయితే ఇంట్లో ఏదో ఒక గొడవ వేసి డబ్బులు తీసుకెళ్ళడం... తాగడం.. లేకుంటే ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుని జల్సా చేయడం ఇతనికి అలవాటు. 

 
అయితే నిన్న రాత్రి మద్యం ఎక్కువగా సేవించాడు ప్రదీప్. నేరుగా ఇంటికి వచ్చాడు. వంట గదిలో ప్రీతి ఉంది. ప్రదీప్ నిద్రించే బెడ్ పైన కూతురు పడుకుని ఉంది. బెడ్ షీట్ కప్పుకుని పడుకుని ఉండటంతో నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు మూశాడు ప్రదీప్. 

 
బెడ్ పై పడుకున్నాడు. ఇంతలో తేరుకున్న ప్రీతి నేరుగా వచ్చి తలుపులు బాదింది. బెడ్ పైన ఉన్నది మన కూతురు అంటూ గట్టిగా అరించింది. అయితే మద్యం మత్తులో ఉన్న అతను అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. తండ్రి నుంచి ప్రతిఘటించి బయటకు వచ్చింది కుమార్తె. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రదీప్‌ను అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments