Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (09:57 IST)
కేరళ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ క్రీడాకారిణీపై 62 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణఆనికి పాల్పడిన కామాంధుల్లో కోచ్‌‌తో పాటు సహా ఆగాళ్లు కూడా ఉన్నారు. బాధితురాలు 13 యేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ఆమెపై లైంగికదాడి జరుగుతుంది. ప్రస్తుతం ఈ క్రీడాకారిణి వయసు 18 యేళ్లు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. మరో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలు 13 యేళ్ళ వయసులో ఉన్నపుడు పొరుగింటి వ్యక్తి బలవంతంగా ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లి పోర్న్ చిత్రాలు చూపించాడు. ఆపై స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక పోటీల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినపుడు తోటి ఆటగాళ్లతో పాటు కోచ్‌ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
అయితే, ఈ విషయాన్ని ఆమె ఎపుడూ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లలేదు. తండ్రి సోన్‌ఫోన్‌ను బాధిత యువతి వాడుతూ వచ్చింది. దీంతో ఆ ఫోనులోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారే ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కేరళ సమాఖ్య సొసైటీ వలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం