టెన్త్ మార్క్ లిస్టు కోసం స్కూలుకెళ్లిన బాలిక.. సహచర విద్యార్థి అత్యాచారం!!

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (10:19 IST)
పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థినిపై సహచర విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను బలవంతంగా తరగతి గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో కామాంధుడి స్నేహితులు మరో నలుగురు ఈ తతంగాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగారు. దీనిపై బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఐదుగురు కామాంధులను జైలుకు తరలించారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది.
 
మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూలుకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను బాలసుబ్రహ్మణ్యం (22), చంద్రశేఖర్ (22), తేజా (19), హరికృష్ణ (19) వీడియో తీశారు. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. 
 
అంతేకాదు, వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ.2 లక్షలు ఇస్తామని చెప్పినా, సరిపోవని, ఇంకా పెద్దమొత్తంలో కావాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడి బాలుడిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్టు రిమాండుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం